విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పర్యాటకులకు దసరా కానుక సిద్ధం చేస్తోంది. కైలాసగిరిపై అడ్వంచర్ స్పోర్ట్స్‌లో భాగంగా స్కై సైక్లింగ్, జిప్ లైనర్లను ఏర్పాటుచేస్తోంది. రెండేళ్ల క్రితమే వీటికి సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరినా పనులు ముందుకుసాగలేదు. ఇటీవల కమిషనర్‌గా వచ్చిన విశ్వనాథన్ పాత వాటిని సమీక్షించి, ఆయా పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టారు.