గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు స్మారక మందిరం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. బుధవారం స్మారక మందిరాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటకశాఖతో పాటు ఇద్దరు ఎంపీలు రూ.10 లక్షల చొప్పున దీనికి నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే పలువురు ఎంపీలు కూడా నిధులు మంజూరు చేస్తారని అన్నారు.