విశాఖ ఆరిలోవలో గల సెంట్రల్ జైల్లో ఖైదీల సంక్షేమ దినోత్సవం బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ ప్రవర్తనతో మెలగాలని సూచించారు. శిక్ష పూర్తి చేసుకున్న తరువాత ఎటువంటి నేరాలకు పాల్పడకుండా కుటుంబంతో సంతోషంగా గడపాలని కలెక్టర్ సూచించారు.