పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని' అంటూ నేచురల్ స్టార్ నాని తన పర్సనల్ సీక్రెట్ బయటపెట్టారు. ఆయన లీడ్ రోల్లో దర్శకుడు శైలేష్ కొలను తెరెకెక్కించిన 'హిట్- 3' సినిమా ట్రైలర్ సోమవారం రిలీజైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశాఖ నగరంలో సంగం హాల్లో సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాని, సినిమాతో పాటు పలు విషయాలు షేర్ చేసుకున్నారు.