రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నందున శుక్రవారం మన్యం, అల్లూరి, గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నంద్యాల తదితర జిల్లాల్లో పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.