వరద బాధితులకు సాయం అందించేందుకు ప్రజలు ముందుకు రావాలని విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పిలుపునిచ్చారు. బుధవారం తన సొంత నిధులతో 24, 000 వాటర్ బాటిల్స్ (500ఎంఎల్), 1500 మిల్క్ బ్రెడ్స్, బిస్కెట్స్ వాహనంలో విజయవాడకు పంపించినట్లు పేర్కొన్నారు. అలాగే ఎవరికి తోచిన విధంగా వారు వరద బాధితులకు చేయూతనందించాలని విజ్ఞప్తి చేశారు.