నమ్మకస్తులను దూరం చేసుకున్న జగన్‌

74చూసినవారు
నమ్మకస్తులను వదులుకుంటే ఇటువంటి ఫలితాలే వస్తాయని వైసీపీని ఉద్దేశించి జనసేన దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ అన్నారు. ఎన్నికల ముందు వరకు వైసీపీలో కీలక నేతగా ఉన్న వంశీకృష్ణ. పార్టీని వీడి జనసేనలో చేరిన విషయం తెలిసిందే. అనూహ్యంగా దక్షిణ టికెట్‌ సాధించి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఏయూ ప్రాంగణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నమ్మకస్తులను జగన్‌దూరం చేసుకున్నాడని, కొందరు మాటలు నమ్మి ఈ విధంగా వ్యవహరించాడని, అందుకే ఇంత ఘోర ఓటమిని ఆ పార్టీ చవిచూసిందని విశ్లేషించారు.

సంబంధిత పోస్ట్