కోటవురట్ల: పశువులకు నీటి కొరత రాకుండా చర్యలు

61చూసినవారు
కోటవురట్ల: పశువులకు నీటి కొరత రాకుండా చర్యలు
వేసవిలో పశువులకు నీటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కోటవురట్ల ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు తెలిపారు. శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలో బాపిరాజు కొత్తపల్లి గ్రామంలో పశువుల కోసం నిర్మించిన నీటి తొట్టెను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో 25 పంచాయతీల్లో 25 నీటి తొట్టెలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. మండల టిడిపి అధ్యక్షుడు లింగన్నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్