విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఎమ్ఎ తెలుగు విభాగం విద్యార్ధులు ఆధ్వర్యంలో గురువారం గురువులను ఘనంగా సత్కరించారు. తెలుగు విభాగాధిపతి ఆచార్య జెర్ర అప్పారావు, సీనియర్ ఆచార్యులు వెలవెల సీమ్మన్న, ఆచార్యులు యోగి వెంకటేశ్వర్లు, బూసి వెంకట స్వామి, రత్న శేఖర్, ఈశ్వరమ్మ, పెండ్యాల లావణ్యలను సత్కరించారు. ఈ సందర్బంగా ఆచార్యులు, విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.