మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. బుధవారం ఎంవిపి కాలనీలో గ్రీన్ క్లైమేట్ సహకారంతో విద్యార్థులతో వినాయక మట్టి ప్రతిమలను తయారు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ది పారిస్, కెమికల్స్ తో తయారుచేసిన వినాయకుని విగ్రహాలు వల్ల వాతావరణ కలుషితం అవుతుందన్నారు.