ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20న విశాఖపట్నంకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో బస చేస్తారు. జూన్ 21న ఉదయం 6.30 నుంచి 7.45 వరకు ఆర్కే బీచ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి వెళ్తారు. ఈ నేపథ్యంలో నగరంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.