విశాఖలోని ఆంధ్రయూనివర్సిటీ సంగీత నృత్య విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 24, 25వ తేదీల్లో భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్య శోభ పేరిట రెండు రోజులు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈమేరకు శుక్రవారం ఏయూ వీసీ ఆచార్య జి. శశిభూషణరావు పోస్టర్ విడుదల చేశారు. ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమాన్నుద్దేశించి ఆయన మాట్లాడుతూ సంగీతనృత్య సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.