విశాఖలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను బుధవాం నిర్వహించారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు , జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్, వై. యస్. ఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో మేయర్ వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు.