విశాఖ నగరపాలక సంస్థ చేపడుతున్న ప్రాజెక్ట్ లు, అభివృద్ధి పనులు శాశ్వత పద్దతిన ప్రణాలికా యుతంగా వుండాలని, ప్రజా ప్రతినిధులు అధికారులు సమిష్టిగా పనిచేయాలని ఎంపీ ఎం. శ్రీభరత్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ప్రభుత్వ అతిధి గృహంలో జివిఎంసి అభివృద్ధి పనులపై నగర ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. భరత్ మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జివిఎంసి అధికారులు ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.