విశాఖలో 60 వేల మందితో ప్రధాని రోడ్ షో

55చూసినవారు
విశాఖలో 60 వేల మందితో ప్రధాని రోడ్ షో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. ప్రధాని 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) ఇంజినీరింగ్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు హాజరుకానున్నారు. కాగా 60వేల మందితో రోడ్ షోకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్