జూన్ 21న విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ నెల 29 నుంచి నాలుగు వారాలపాటు ప్రచార కార్యాచరణ నిర్వహిస్తారు. జూన్ 5 నుంచి వారం పాటు నియోజకవర్గాల్లో, జూన్ 12 నుంచి వారం పాటు గ్రామస్థాయిలో ప్రచారం నిర్వహిస్తారు. అలాగే జూన్ 17 నుంచి విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించనున్నారు.