విశాఖలో కుమ్మేస్తున్న వర్షాలు

50చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విశాఖలో గురువారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులపై భారీగా వర్షం నీరు చేరింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్