విశాఖలోని 60 ఏళ్ల మహిళకు ఆరిలోవ, హెల్త్ సిటీలోని ఒమెగా ఆసుపత్రి అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి ప్రాణాలను కాపాడారు. దీనికి సంబంధించి సోమవారం ఆసుపత్రి సమావేశం మందిరంలో విలేకర్లతో మాట్లాడుతూ అచ్యుతాపురానికి చెందిన 60 ఏళ్ళ మహిళ కడుపులో 8 కిలోల కణితి ఉండడంతో అతి కష్టమ్మీద తొలగించినట్లు తెలిపారు. శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని వైద్యులు చెప్పారు.