రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 24 ప్రధాన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ డిమాండ్ చేశారు. విశాఖ ఆర్టీసీ పీడీటీ ఎంప్లాయిస్ యూనియన్ పిలుపు మేరకు మద్దిలపాలెం సిటీ డిపో, విశాఖపట్నం రూరల్ డిపోల వద్ద కార్మికులు శనివారం ధర్నా నిర్వహించారు. నిరంతరం శ్రమిస్తున్న కార్మికులు ఉద్యోగుల సమస్యల పరిశీలించడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు.