ఎస్ రాయవరం: సర్వస్థిద్ధిలో జాతీయ డెంగ్యూ డే

64చూసినవారు
ఎస్ రాయవరం: సర్వస్థిద్ధిలో జాతీయ డెంగ్యూ డే
దోమల కారణంగా వ్యాప్తి చెందే డెంగ్యూ వ్యాధిని అవగాహన ద్వారా నియంత్రించవచ్చునని సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ వాసంతి అన్నారు. జాతీయ డెంగ్యూ డే సందర్భంగా సర్వస్థిద్ధిలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. మనం నివసించే ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే పలు రోగాలు దూరంగా ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్