ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్ లో ఈనెల 22వ తేదీన టీడీపీ మినీ మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. శుక్రవారం నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో టీడీపీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా ఇంచార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొంటారని అన్నారు.