విశాఖలో పీసీసీ చీఫ్ షర్మిల తన పర్యటనలో జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. అంబేద్కర్ జపం చేస్తే కాంగ్రెస్ తప్పేమిటని ఆమె ప్రశ్నించారు. అంబేద్కర్‌ను బీజేపీ అవమానించిందని ఆరోపించారు. అదే సమయంలో, ఏపీ ప్రజలను ప్రధాని మోదీ మోసం చేశారని, బీజేపీ, టీడీపీ, జనసేన అక్రమ సంబంధాలు పెట్టుకున్నాయని వ్యాఖ్యానించారు. తన నిరసనగా సాయంత్రం మౌనదీక్ష చేస్తానని ప్రకటించారు.