కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం విశాఖ బీచ్ రోడ్డులో టీడీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు. భరత్ మాట్లాడుతూ, ప్రజల ఆశీర్వాదంతో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, త్వరలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.