ఏపీలో ‘తలసేమియా రన్-వైజాగ్' కార్యక్రమాన్ని మే 8న సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. అన్ని వయసుల వారు వారి వారి శారీరక సామర్థ్యం ఆధారంగా 3,5,10 కిలోమీటర్ల కేటగిరీల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఆసక్తిగలవారు సంబంధిత వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నారా భువనేశ్వరి అన్నారు.