కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్య సంఘటనకు నిరసనగా బుధవారం ఏయూలో విద్యా విభాగం ప్రొఫెసర్ టి షారోన్ రాజు ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు విద్యార్ధులు పరిశోధకులు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా షారోన్ రాజు మాట్లాడుతూ ఇటువంటి హేయమైన భయానకమైన సంఘటనలను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.