విశాఖ విమ్స్‌లో గురువారం వైద్యులు సమ్మెకు దిగారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరి మూడేళ్లు అయిన వారికి జీతాలు పెంచాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు స్పందించలేదన్నారు. ఈ అంశంపై ఫైల్‌ను హెల్త్ సెక్రటరీ ఆఫీసుకు పంపి రెండు నెలలు గడిచినా స్పందనలేదని తెలిపారు.