వైఎస్ జగన్ పై గత 15 ఏళ్లగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తునే ఉన్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు అబద్ధాలపై పోరుబాట సాగించనున్నామన్నారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఆదానీ దగ్గర లంచం తీసుకున్నారని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాస్తవాలను ప్రజల ముందు వైఎస్ జగన్ ఉంచినా దుష్ప్రచారం చేయడం తగదన్నారు.