విశాఖలోని ఎం వి పి కాలని సెక్టార్ -1 లో నిరుపయోగంగా ఉన్న వుడా కళ్యాణమండపం స్థితి గతులను ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణ బాబు, జనసేన రాష్ట్ర ప్రధాని కార్యదర్శి బోలిశెట్టి సత్యతో కలిసి విఎంఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ గురువారం సందర్శించారు. ప్రస్తుతం కళ్యాణమండపం స్థితిని తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయంలో రూ. 4 కోట్లతో నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లుగా గుర్తించారు.