దేశాభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ పాలకులకు మంచి ఆలోచనలు కలగాలని ప్రార్దిద్దామని అపర రామానుజులు, ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన్న జీయర్ స్వామి పిలుపునిచ్చారు. వారి ప్రత్యక్ష నిర్వహణ లో విశాఖలో శ్రీరామ పాదుకా ఆరాధన పూజలు ఆదివారం వైభవ గా జరిగాయి. స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహిస్తున్న గీతా జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం భక్తుల నుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.