సబ్బవరం మండలంలోని గంగవరం, వెదుళ్ల నరవ, పైడివాడ అగ్రహారం గ్రామాల్లో అర్బన్ హౌసింగ్ స్కీమ్ లో మంజూరు చేసిన గృహ నిర్మాణాలను శనివారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో 2026 నాటికి 3 లక్షల గృహప్రవేశాలు జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఈ ఏ శ్రీనివాసరావు, ఏఈలు కేవీ సూర్యరావు తదితరులు పాల్గొన్నారు.