పిల్లలను అమ్మినా, కార్మికులుగా మార్చినా కఠిన చర్యలు తప్పవని, పిల్లలు కావలసినవారు దత్తత చట్టబద్ధంగా తీసుకోవాలని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గురువారం విశాఖ ఉడా చిల్డ్రన్ ధియేటర్ నందు ఫోస్టర్ అడాప్షన్ అవగాహన ఒక రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టబద్ధం కాని దత్తతపై అవగాహన కలిగించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.