పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ మేరకు విశాఖ వాతావరణ శాఖ అధికారి తార స్వరూప బుధవారం ప్రకటించారు. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రానున్న 4 రోజుల పాటు ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 35-45 కి.మీల వేగంతో తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఈ క్రమంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.