విశాఖ: స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అలర్ట్

63చూసినవారు
విశాఖ: స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అలర్ట్
విశాఖ ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్న యాజమాన్య నిర్ణయానికి నిరసనగా కార్మిక సంఘాలు ఈ నెల 16 నుంచి సమ్మెకు దిగనున్నట్టు ప్రకటించడంతో యాజమాన్యం అప్రమత్తమైంది. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు అన్ని సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సిబ్బంది అందరూ విధులకు హాజరుకావాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్