అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం చాలా తప్పని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. విశాఖలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఒక స్టార్ హీరో తన సినిమాను థియేటర్లో చూడడం తప్పా అని ప్రశ్నించారు. తొక్కిస లాటలో మహిళా మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. అయితే జాతీయ ఉత్తమ నటుడు పట్ల ప్రభుత్వం ప్రవర్తించిన తీరు సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు.