విశాఖ: తొలి ఫైటర్‌ పైలట్‌గా ఆస్తా పూనియా

8చూసినవారు
విశాఖ: తొలి ఫైటర్‌ పైలట్‌గా ఆస్తా పూనియా
సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా, నేవీ ఫైటర్ పైలట్‌గా శిక్షణ పొందిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. జూలై 3న విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగాలో జరిగిన సెకండ్ బేసిక్ హాక్ కన్వర్షన్ కోర్సు స్నాతకోత్సవంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రియర్ అడ్మిరల్ జనక్ బెవ్లీ చేతుల మీదుగా 'వింగ్స్ ఆఫ్ గోల్డ్' బహుమతిని లెఫ్టినెంట్ అతుల్ కుమార్ ధుల్‌తో కలిసి స్వీకరించారు.