రేసపువానిపాలెం వినాయకనగర్‌లో మానసిక దివ్యాంగ బాలికపై అత్యాచారయత్నం జరగింది. కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్న పిన్నింటి చంద్రశేఖర్ బాలికకు కొద్దిరోజులుగా తినుబండారాలు ఇచ్చి పరిచయం పెంచుకున్నాడు. శుక్రవారం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో బాలికను గదికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాలిక అరవడంతో స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.