ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చని విశాఖ విమ్స్ డైరెక్టర్ డా. కే. రాంబాబు అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి సిబ్బంది నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.