విశాఖ జిల్లా ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కొవ్వొత్తులతో సర్వమత ప్రార్థనలు, భజనలు ఆలపిస్తూ విశ్వ మానవ కళ్యాణం, విశ్వశాంతి కోసం ప్రార్థనలు చేశారు. ఉక్కునగరం శ్రీ సత్య సాయి భక్తులు ఉక్కు నగరం సెక్టార్-2 దగ్గర నుంచి మిగతా సెక్టార్లను కలుపుకుంటూ సర్వమత ర్యాలీ నిర్వహించారు.