ప్రజలకు మంచి జరగడం కోసం ఎవరినైనా ఎదిరిస్తానని, బొగ్గు, ఫ్లై యాష్ లారీల రవాణాలో నిబంధనలు పాటించకపోతే పోరాటానికి సిద్ధమని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హెచ్చరించారు. శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. లంకెలపాలెం జంక్షన్ మీదుగా వెళ్లే బొగ్గు, ఫ్లై యాష్ లారీలు అధిక లోడులతో, అతి వేగంగా ప్రయాణించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.