భోగాపురం మండలంలోని ముక్కాం గ్రామానికి చెందిన దానయ్య (45) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భోగాపురం ఎస్‌ఐ పాపారావు తెలిపిన వివరాల ప్రకారం, దానయ్య తన భార్య ఎల్లమ్మతో కలిసి విశాఖలోని జాలరిపేటలో నివాసముండేవాడు. ఇటీవల వారిద్దరి మధ్య తలెత్తిన గొడవల నేపథ్యంలో ఆమెను కొట్టాడు. ఆమె ఫిర్యాదు చేయగా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ మళ్లీ దాడికి పాల్పడటంతో భార్య మరోసారి ఫిర్యాదు చేసింది. దీనికి మనస్తాపం చెందిన దానయ్య, గురువారం ముక్కాం గ్రామంలోని ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు.