విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 ఆగస్టులో కొండవీటి శివ కర్రతో దాడి చేసి ఓ వ్యక్తిని గాయపరిచాడు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఈ కేసుపై విచారణ పూర్తయ్యింది. మంగళవారం జిల్లా సెకండ్ ఏడీజే కోర్టు నిందితుడికి జీవితఖైదు విధిస్తూ జడ్జి గాయత్రి దేవి తీర్పు ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ. 3 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు.