మే 10, 11న జరిగే సీపీఐ మహా సభలను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పైడిరాజు బుధవారం జ్ఞానపురంలో పిలుపునిచ్చారు. మూడేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ సభల్లో భాగంగా మే 10వ తేదీ సా.4 గంటలకు కంచరపాలెం మెట్టు నుంచి ఓల్డ్ ఐటీఐ జంక్షన్ వరకు ప్రజా ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. మే 11న ఉ. 9గంటల నుంచి మురళీనగర్ బీస్వేర్ ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ ఉంటుందని తెలిపారు.