విశాఖ: నిర్మానుష్య ప్రాంతంలో డెడ్ బాడీ లభ్యం

56చూసినవారు
విశాఖ: నిర్మానుష్య ప్రాంతంలో డెడ్ బాడీ లభ్యం
మధురవాడ దరి కొమ్మాది గ్రామానికి సమీపంలో గుర్తి తెలియని మృతదేహాన్ని ఆదివారం పీఎం పోలీసులు గుర్తించారు. కొండగుట్ట వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ఈ డెడ్ బాడీని గుర్తించామని పోలీసులు తెలిపారు. చనిపోయిన ఆ వ్యక్తి వయసు 50 సంవత్సరాలు ఉండొచ్చని, అతను వారం రోజుల క్రితమే మృతి చెంది ఉంటాడని అనుమానిస్తారు. మృతుడి వివరాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్