సమష్టిగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని ప్రముఖ సినీ నటుడు, మిలీనియం స్టార్ కంచర్ల ఉపేంద్ర బాబు అన్నారు. బాలభాను పురోహిత , అర్చక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ కంబాలకొండలో నిర్వహించిన వనమహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి అర్చకులు పురోహితులు ఏకతాటిపై పనిచేయాలని సూచించారు. వీరి సంక్షేమం కోసం ఉపకార స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.