రాష్ట్రంలో పోలీసు స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని హోం మంత్రి అనిత తెలిపారు. ఆదివారం విశాఖలోని ఆరిలోవ పోలీసు స్టేషన్‌ను డీజీపీ ద్వారక తిరుమలరావుతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ.5 కోట్లతో ఆరిలోవ పోలీసు స్టేషన్‌ను నిర్మించామన్నారు. పోలీసుల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప‍్తంగా పోలీసు సేష్టన్ల అభివృద్ధి పనులు ప్రారంభించనున్నామన్నారు.