దేవి సుస్వరాలు ఆధ్వర్యంలో లాయర్ ఐ. శ్రీదేవి నిర్వహణలో జరిగిన సినీ సంగీత విభావరి అలరించింది. శుక్రవారం సాయంత్రం విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సంగీత కళా ప్రముఖులు సన్ మూర్తి, నాంచారయ్య, జే ఎం ఆర్ నెహ్రూ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నగరానికి చెందిన పలువురు గాయకులు పాటలు పాడారు.