డిసెంబర్ 25 నుండి 29 వరకు విజయవంతంగా నిర్వహించిన ఎస్. హెచ్. జి. మేళా ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో, ఈ మేళాను సోమవారం కూడా కొనసాగించనున్నట్టు విశాఖ జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మేళాను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు. గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం అందజేస్తోందని తెలిపారు.