విశాఖపట్నంలో జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, యోగాంధ్ర కార్యక్రమం, ఏ-ఐ ఆధారిత యోగా శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు సాంకేతిక సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం విశాఖలోని ఏయూ కన్వెన్షన్ హాలులోని సాగరిక హాలులో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలు మార్పిడి జరిగాయి.