బడి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పిఎమ్ పోషన్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకానికి సంబంధించిన పలు అంశాలపై జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యతతో కూడిన భోజనం అందించే క్రమంలో రాజీ పడకూడదన్నారు.