జీవీఎంసీలో బలం లేకపోయినా కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం పెట్టారని బుధవారం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో విమర్శించారు. విశాఖ మేయర్ పై వారు పెట్టిన అశ్వాసం వీగిపోతుందన్నారు. ఈ నెల 19న జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకూడదని వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తామని చెప్పారు. వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు సీఎం స్వస్తి పలకాలని సూచించారు.